Jagan on EVM's : ఎన్నికల్లో (Elections) వైసీపీ (YCP) ఘోర పరాజయానికి ఈవీఎం (EVM) లే కారణమని వైసీపీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బలంగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకు ఓడిపోయామో అర్ధం కావడం లేదు అంటూ ఓటమి తరువాత చెప్పిన జగన్.. తరచూ అదే అర్ధం వచ్చేలా మాట్లాడుతూ వస్తున్నారు. ఈవీఎంల పై సందేహాలనూ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈవీఎంల విషయంలో మరో ముందడుగు వేసి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానంలోనే మనదేశంలో ఎన్నికలు జరగాలి అంటూ ఒకరకమైన డిమాండ్ చేస్తున్నారు.
Jagan on EVMs : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంల విషయంలో ఈరోజు Xలో ఒక పోస్ట్ చేశారు. అందులో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు అర్ధం వచ్చేలా నేరుగానే పదాలను కూర్చారు. ఆయన Xలో చేసిన ట్వీట్ లో యధాతథంగా ఏముందంటే..
“న్యాయం జరగడం మాత్రమే కాదు, అందజేయబడినట్లు కూడా కనిపించాలి, అలాగే ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా కనిపించాలి.
దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో, పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తారు. EVMలు కాదు.
మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి.”
జగన్ చెబుతున్నదాని ప్రకారం అసలు ఈవీఎంలు వాడకుండా ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే జరగాలని అర్ధం అవుతోంది. తన ఓటమికి కారణంగా ఆయన ఈవీఎంలనే తప్పుపడుతున్నట్టు కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ ఇదే..
అప్పుడలా.. ఇప్పుడిలా..
Jagan on EVMs : జగన్ ట్వీట్ చేసిన వెంటనే.. చాలా మంది రిప్లైలు ఇస్తూ వస్తున్నారు. వైసీపీ అభిమానులు సహజంగానే ఈవీఎంల పై నోరు పారేసుకుంటుంటే.. మరోవైపు గతంలో జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంలపై ఒక సమావేశంలో మాట్లాడిన వీడియోను షేర్ చేసి అప్పుడలా.. ఇప్పుడిలా.. ఇదేమిటండీ అని అడుగుతున్నారు. ఆ వీడియోలో ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి.. ఎంత కచ్చితంగా ఉంటాయి అనే విషయాన్ని ఆయన స్వయంగా అందరికీ అర్ధం అయ్యేలా వివరిస్తున్నారు. వేసిన ఓటు కూడా ఓటు వేసినవారికి కనిపిస్తుంది అంటూ ఈవీఎంల గొప్పతనాన్ని వివరిస్తున్నారు ఆ వీడియోలో. ఆ వీడియో ట్వీట్ ఇదే..
Also Read : ‘OG’ బ్లాస్ట్ ఆన్ ది వే.. స్పీకర్లు బద్దలవుతాయి – అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థమన్!