పాక్ లో విరాట్ కు భారీ ఫాలోయింగ్ ఉంది..పాక్ మాజీ క్రికెటర్!

ICC ఛాంపియన్ ట్రోఫి లో భాగంగ భారత జట్టు పాక్ లో పర్యటించాలని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పిలుపునిచ్చారు. పాక్ లో భారత్ ఆటగాళ్లకు చాలా మంది అభిమానులున్నారని ఆయన పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ వస్తున్నాడని తెలిసి పాక్ లో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని ఆఫ్రిది తెలిపాడు.

New Update
పాక్ లో విరాట్ కు భారీ ఫాలోయింగ్ ఉంది..పాక్ మాజీ క్రికెటర్!

ICC ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్‌లో ఆడేందుకు భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌కు రావాలని క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌లో భారత జట్టు ఆటగాళ్లకు చాలా మంది అభిమానులు ఉన్నారని, వారి ప్రేమను అర్థం చేసుకునేందుకు భారత జట్టుకు ఇది అవకాశంగా నిలుస్తుందని అన్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ సిరీస్ పాకిస్థాన్‌లో జరగనుంది. ప్రతిపాదిత షెడ్యూల్‌ను పాక్ క్రికెట్ బోర్డు ICCకి సమర్పించగా, BCCI ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే భారత జట్టు పాకిస్థాన్ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు సమాచారం.ఈ అంశంపై  ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించలేదు. దీంతో అభిమానులు, క్రికెట్ ప్రియులు అయోమయంలో పడ్డారు.

ఈ విషయంపై పాక్ దిగ్గజం షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. భారత జట్టును పాకిస్థాన్‌కు స్వాగతిస్తున్నాను. 2005లో మేము భారతదేశానికి వెళ్ళినప్పుడు, మమ్మల్ని చాలా గౌరవించారు. నాకు క్రీడలతో రాజకీయాలను అనుసంధానం చేయాల్సిన అవసరం లేదు. భారత ఆటగాళ్లు పాక్‌కు వెళ్లడం, పాక్‌ ఆటగాళ్లు భారత్‌కు రావడం చాలా ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి పాకిస్థాన్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ భారత్‌లో తనకు లభించిన ప్రేమను మరిచిపోతాడు.

విరాట్ కోహ్లీకి పాకిస్థాన్‌లో భారీ మాస్ ఫాలోయింగ్ ఉంది. విరాట్ కోహ్లీ వస్తున్నాడని పాక్ క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.విరాట్ కోహ్లీ కూడా నా ఫేవరెట్ ప్లేయర్. నా అభిప్రాయం ప్రకారం, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఉండకూడదు. విరాట్ కోహ్లి పాకిస్థాన్ స్టేడియంలో ఆడతాడా అని ఎదురుచూస్తున్నామని ఆఫ్రిది పేర్కొన్నాడు.చివరిసారిగా 2008లో భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు