Telangana Elections: పటేల్‌ రమేష్‌ రెడ్డి వర్సెస్ దామోదర్ రెడ్డి.. ఇద్దరి మధ్య పగ ఇదే.!

సూర్యాపేటలో పటేల్‌ రమేష్‌ రెడ్డి, దామోదర్‌ రెడ్డి మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. సూర్యాపేట కాంగ్రెస్‌లో రమేష్‌ రెడ్డి, దామోదర్‌ రెడ్డి వర్గాలుగా విడిపోయారు కేడర్. వీరిద్దరికీ ఒకరంటే ఒకరు పడటం లేదు. టికెట్ నాదంటే నాదంటూ.. ఎవరికి వారు ప్రచారం మొదలుపెట్టేశారు.

New Update
Telangana Elections: పటేల్‌ రమేష్‌ రెడ్డి వర్సెస్ దామోదర్ రెడ్డి.. ఇద్దరి మధ్య పగ ఇదే.!

Suryapet: తెలంగాణలో నామినేషన్ల పర్వం మొదలైంది. అధికార బీఆర్ఎస్(BRS)పార్టీ తన అభ్యర్థులను ఎప్పుడో ఖరారు చేయడంతో.. వారంతా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) కూడా కొన్ని చోట్ల మినహా దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే, తెలంగాణ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో సిత్రం కనువిందు చేస్తోంది. నేతల ఆశలు, అగచాట్లు, జంపింగ్‌లు, జిమ్మిక్కులు.. రాజకీయాన్ని మస్త్ రక్తి కట్టిస్తున్నాయి. ఇలాంటి పొలిటికల్ సిత్రాల్లో.. సూర్యాపేట హాట్ సీటుగా మారింది. అందునా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ పార్టీలో సూర్యాపేట సీటు కోసం పోటీ పడుతున్న వారిలో ఒకరేమో కాంగ్రెస్‌లోనే సీనియర్. మరొకరు టీపీసీసీ చీఫ్‌కు సన్నిహితులు. సీనియర్‌ను నాకే సీటు కన్ఫామ్ ఆయన భావిస్తుంటే.. రేవంత్ టికెట్‌ను నాకే ఇస్తాడని ఈయన ఫిక్స్ అయిపోతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలెవరనేగా తొందర.. ఒకరు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, మరొకరు పటేల్ రమేష్ రెడ్డి. వీరిద్దరి మధ్య సూర్యాపేట సీటు కోసం కోల్డ్ వార్ నడుస్తోంది.

అవును సూర్యాపేటలో పటేల్‌ రమేష్‌ రెడ్డి, దామోదర్‌ రెడ్డి మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. సూర్యాపేట కాంగ్రెస్‌లో రమేష్‌ రెడ్డి, దామోదర్‌ రెడ్డి వర్గాలుగా విడిపోయారు కేడర్. వీరిద్దరికీ ఒకరంటే ఒకరు పడటం లేదని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఇందుకు కారణం కూడా చెబుతున్నారు. అదేంటంటే.. 2014లో టీడీపీ తరపున దామోదర్ రెడ్డిపైనే పోటీ చేశారు పటేల్ రమేష్ రెడ్డి. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరారు రమేష్ రెడ్డి. 2018లోనే సూర్యాపేట టికెట్‌ కోసం రమేష్‌రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ సారి వదులుకునే ప్రసక్తే లేదని, తాడోపేడో తేల్చుకుంటానని అంటున్నారు పటేల్ రమేష్ రెడ్డి. తన సన్నిహితుడైన రేవంత్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్ కావడంతో టికెట్ తనదేనని రమేష్ ధీమాలో ఉన్నారు. అంతేకాదు.. తాను లోకల్ అని, టికెట్ తనకే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇక 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన అనుభవం దామోదర రెడ్డికి ఉంది. దాంతో సీనియర్‌ను అయిన తనకే టికెట్ కన్ఫామ్ అని దామోదర రెడ్డి ఫిక్స్ అయ్యారు. అదేవిధంగా 2018 ఎన్నికల్లో తన ఓటమికి పటేల్ రమేష్‌ రెడ్డే కారణమని ఆయనపై దామోదర్‌ రెడ్డికి పీకల్లోతు కోపం ఉందట. అలా అప్పటి నుంచి వీరిద్దరు నేతల మధ్య వైరం పెరుగుతూ వస్తోందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్‌ ఈ టికెట్‌ను ఇంకా తేల్చకపోవడంతో.. పోటా పోటీగా ఇద్దరు నేతలు ప్రచారం ప్రారంభించారు. మరి టికెట్ కన్ఫామ్ అయిన తరువాత.. టికెట్ దక్కని నేత పరిస్థితి ఏంటో అన్నది మరింత ఆసక్తిని పెంచుతోంది.

Also Read:

కోమటిరెడ్డి బ్రదర్స్ సంగతి చూస్తా! చిరుమర్తి లింగయ్య సెన్సేషన్ కామెంట్స్..

ఎన్నికల్లో పోటీకి షర్మిల వెనుకడుగు.. పొంగులేటి వ్యూహం ఫలితమేనా?!

Advertisment
Advertisment
తాజా కథనాలు