Summer : వేసవిలో చెరుకు రసం తాగండి.. డీహైడ్రేట్ నుంచి బయటపడండి !

నిప్పుల కక్కే సూర్యుడి నుంచి శరీరాన్ని చలువ పరుచుకునేందుకు చల్లటి పానీయాలు అవసరం. చల్ల చల్లగా రుచికరమైన రసాలను తాగడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.అయితే వేసవిలో చెరుకు రసం తీసుకోవటం ఎంత మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
Summer : వేసవిలో చెరుకు రసం తాగండి.. డీహైడ్రేట్ నుంచి బయటపడండి !

Sugar Cane Benefits : నిప్పుల కక్కే సూర్యుడి(Sun) నుంచి శరీరాన్ని చలువ పరుచుకునేందుకు చల్లటి పానీయాలు(Cool Drinks) అవసరం. చల్ల చల్లగా రుచికరమైన రసాలను తాగడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాటితోపాటు కొద్దిగా నిమ్మకాయ రసం, కొంచెం అల్లం రసం వంటివి కలిపి ఇచ్చారంటే వాటి రుచి చాలా అద్భుతం అంటారు ప్రజలు.

చెరుకు గడ(Sugar Cane) లను తినటమే కాదు.. జ్యూస్ లను కూడా తాగాలి. అప్పుడే అసలైన మజా ఉంటుంది. మరి అలాంటి చెరుకు రసాన్ని తాగటానికి వేసవి(Summer) లో చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అసలు చెరకు ఉత్పత్తులు  కర్నూలు ఇతరప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుంటానన్నారు. బాగా ఎండలు ముదిరిపోవటంతో జనాలు దప్పిక తీర్చుకోవడం కోసం పళ్ల రసాలు, చెరుకు రసాలకు ఎక్కువగా ప్రాధాన్యాతను ఇస్తున్నారు. చెరుకు రసం ఒక గ్లాస్ వచ్చేసి 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది.

ఒక లీటర్ బాటిల్ చెరుకు రసం వచ్చేసి 150 రూపాయలతో అమ్మకాలు జరుపుతూ ఉంటామన్నారు. ఈ చెరుకు రసం తాగిన ప్రతి ఒక్కరు మెచ్చాల్సిందేనన్నారు. అంత రుచిగా ఉంటుందని తెలిపారు. ఈ ఎర్రటి ఎండల్లో చల్లటి చెరుకు రసం, పండ్ల రసం, లేదంటే చల్లటి నీళ్లు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా సేల్స్ అవుతాయన్నారు. వాటి కన్నా హెల్తీ హెల్తీగా ఉండే చెరుకురసం చాలా బెస్టు అని అంటున్నారు.

నిమ్మకాయ, అల్లం కలిపి చెరుకు రసం తయారు చేయటం రుచికి బాగుంటుందన్నారు. అల్లం, నిమ్మకాయ రసం ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు. మరెందుకు ఆలస్యం ఎప్పుడైనా ఇటుగా పయనిస్తే మాత్రం ఈ చెరుకు రసాన్ని మాత్రం తాగకుండా మాత్రం వెళ్లకండి.

Also Read : ‘నోటా’ ఆప్షన్ ఉండగా ఏకగ్రీవంగా ఎలా ఎన్నికవుతారు: ముంతాజ్ పటేల్

Advertisment
Advertisment
తాజా కథనాలు