Home Tips: నేల మీద ఈ వస్తువులు పెట్టారంటే ఇక అంటే..డబ్బు అస్సలు నిలవదు

ఇబ్బందులు తొలగిపోవాలన్నా దీపారాధన సరైన మార్గం. హిందూధర్మం ప్రకారం కొబ్బరికాయలు, కర్పూరం, అగర్‌బత్తీలు, బంగారాన్ని కింద పెట్టకూడదని చెబుతున్నారు. పసిడిని లక్ష్మీదేవి స్వరూపం అని నమ్ముతారు. దీనిని నేలపై ఉంచితే ల‌క్ష్మీదేవికి కోపం వస్తుందని నిపుణులు అంటున్నారు.

New Update
Home Tips: నేల మీద ఈ వస్తువులు పెట్టారంటే ఇక అంటే..డబ్బు అస్సలు నిలవదు

Home Tips: హిందువులు కొన్ని వస్తువులను పవిత్రంగా చూసుకుంటారు. వాటిని శుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే పెడుతుంటారు. పూజకు వాడే కొబ్బరికాయలు, కర్పూరం, అగర్‌బత్తీలు వంటివి అస్సలు కింద పెట్టారు. పొరపాటున పెట్టాల్సి వస్తే వాటిని తిరిగి ఉపయోగించరు. మళ్లీ వినియోగిస్తే ఇంట్లో అశుభం జరుగుతుందని భావిస్తూ ఉంటారు. హిందూధర్మం ప్రకారం కింద పెట్టకూడదని కొన్ని వస్తువులు ఉన్నాయి. దీపాన్ని కింద పెట్టకూడదు. వెలిగించినా లేకపోయినా కింద మాత్రం ఉంచకూడదు. శుభ్రమైన క్లాత్‌ మీదే ఉంచాలని పండితులు చెబుతున్నారు.
ఎందుకంటే నేలపై దీపం పెడితే దేవుడిని అవమానించడమే అవుతుందని అంటున్నారు.

publive-image

మనకు ఏదైనా కావాలన్నా, ఇబ్బందులు తొలగిపోవాలన్నా దీపారాధన సరైన మార్గం. దీపం ఎక్కడ పడుతుందో అక్కడ ఆధ్యాత్మిక శక్తి వెల్లి విరుస్తుంది. కింద పెట్టకూడని రెండో వస్తువు బంగారం. పసిడిని లక్ష్మీదేవి స్వరూపం అని నమ్ముతారు. బంగారాన్ని నేలపై ఉంచితే ల‌క్ష్మీదేవికి కోపం వస్తుందని, ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఇంట్లో డబ్బులు ఒక్క క్షణం కూడా నిలవదని చెబుతున్నారు. అందుకే బంగారాన్ని అస్సలు కింద పెట్టొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇక మూడో వస్తువు జంధ్యం. జంధ్యం విషయం తెలిసిన వారెవరూ కింద పెట్టరు.

publive-image

బ్రాహ్మణులు జంధ్యాన్ని వాడుతారు. దాన్ని గురువులు,తల్లిదండ్రుల ప్రతిరూపంగా భావిస్తారు. కింద పెడితే వారిని అవమానించినట్టే అని నమ్ముతారు. నాలుగో వస్తువు శంఖం, ఇందులో సాక్ష్యాత్తు ల‌క్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు. శంఖును కింద పెడితే ల‌క్ష్మీదేవి ఆగ్రహానికి గురికాక తప్పదు. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. సాలిగ్రామం అనే రాయిని కింద పెట్టకూడదు. నేపాల్‌లో గండకి నది దగ్గర నల్లరాయి దొరుకుతుంది. దీన్నే సాలిగ్రామం అని పిలుస్తారు. విష్ణుమూర్తికి ఈ రాయి ప్రతిరూపం అని పురాణాలు అంటున్నాయి. దీనిని నేలపై ఉంచితే అప్పటి నుంచి ఆ వ్యక్తికి అన్నీ సమస్యలే వస్తాయట, ఒక వేల కింద పెట్టాల్సి వస్తే నేలను శుభ్రం చేశాకే పెట్టవచ్చంటున్నారు.

ఇది కూడా చదవండి: ఈ ఆహారాలు తింటే మీ తెలివి తేటలన్నీ కరిగిపోవడం ఖాయం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు