CM's Breakfast Scheme in Telangana: స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపటి నుంచే(06-10-2023, శుక్రవారం) ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం'ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy) తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకారం.. శుక్రవారం నాడు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవులు పూర్తి కాగానే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ఈ పథకంలో భాగంగా పాఠశాలల్లో అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. ఇక ఈ పథకం అమలు, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్లకు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు చూసుకుంటారని విద్యాశాఖ తెలిపింది. ఈ పథకం అమలు కోసం విద్యా శాఖ, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి.
Also Read:
Cholera : ఆ దేశం వెన్నులో వణుకు…100 దాటిన మరణాలు…!!
Pawankalyan: ‘నీ సంగతి చూస్తాం కొడకా అంటూ మెసేజ్‌లు వచ్చాయి’.. పవన్ సంచలన వ్యాఖ్యలు!