CMAT Application Date Extended : మేనేజ్‌మెంట్ కోర్సు(Management Course) ల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ పరీక్ష(CMAT Exam) కు దరఖాస్తుల స్వీకరణను గడువు పొడిగించారు. ఈ నోటిఫికేషన్ ని గత నెలలో విడుదల చేయగా మార్చి 19 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ముందుగా ప్రకటించారు.
అయితే చివరిత తేదీ సమయానికి దరఖాస్తులు ఎక్కువగా వస్తుండడంతో అప్లికేషన్ల గడువును ఎన్టీఏ(NDA) పొడిగించింది. దీంతో ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 23 వ తేదీ రాత్రి వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలో సాధించిన మార్కులతో దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం విద్యా సంవత్సరం చివరి సంవత్సరం చదువుతున్నవారూ కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రాసేందుకు గరిష్ఠ వయసు నిబంధన లేదు. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
దరఖాస్తు ఫీజు : జనరల్ కేటగిరీ పురుషులకు రూ.2000; మిగతా అందరూ రూ.1000 రుసుము చెల్లించాలి.
దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఏప్రిల్ 24 నుంచి 26 వరకుకూడా సవరించుకోవచ్చు.
పరీక్ష కేంద్రాలు ఎక్కడ?
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్(Download Hall Tickets) ఎప్పటినుంచి అనే వివరాలు అధికారులు తర్వాత వెల్లడిస్తారు. పరీక్ష మే నెలలో జరిగే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్ష(Online Exam) లో ఒక్కో సెక్షన్ నుంచి 20 చొప్పున 5 విభాగాల్లో వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. అవి.. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.
పరీక్ష వ్యవధి 3 గంటల సమయం. ప్రతి ప్రశ్నకు 4 చొప్పున మొత్తం ప్రశ్నపత్రానికి 400 మార్కులు. ప్రశ్నాపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. https://exams.nta.ac.in/CMAT/
Also read: మెట్రో నగరాల్లో నివసిస్తున్నారా.. అయితే జాగ్రత్త..ఎందుకంటే!