Dussera 2023: మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మ..!

ఇంద్రకీలాద్రీ పై అమ్మవారి శరన్నవరాత్రులు నాల్గవ రోజుకి చేరుకున్నాయి. అమ్మవారు నాల్గవ రోజు మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు ఈ క్రమంలోనే అమ్మవారిని ఏపీ మంత్రి కొట్టు సత్య నారాయణ దర్శించుకున్నారు.

New Update
Dussera 2023: మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మ..!

ఇంద్రకీలాద్రి పై అమ్మవారి శరన్నవరాత్రులు నాల్గవ రోజుకి చేరుకున్నాయి. అమ్మవారు నాల్గవ రోజు మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారిని ఏపీ మంత్రి కొట్టు సత్య నారాయణ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత 3 రోజులుగా అమ్మవారి దర్శనాలు భారీగా జరుగుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు అధికారుల దృష్టికి వచ్చాయి. వాటిని వెంటనే పరిష్కారించినట్లు ఆయన తెలిపారు. శానిటేషన్‌ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నట్లు ఆయన వివరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి 45 నిమిషాలు పడుతుందని తెలిపారు.

భక్తులకు క్యూ లైన్లలో మంచినీరు, మజ్జిగ అందిస్తున్నట్లు వివరించారు. భక్తులు కూడా ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నట్లు ఆయన వివరించారు.

అధికారులు ఎవరూ కూడా ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి రోజూ కూడా అమ్మవారి ప్రసాదంగా 8 రకాల వంటకాలతో ఉచితంగా భక్తులకు అన్న ప్రసాదం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. వృద్దులకు , వికలాంగులకు ఒక ప్రత్యేక సమయం కేటాయించినట్లు ఆయన వివరించారు.

ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యన దర్శనానికి వస్తే చాలా ఈజీగా దర్శనం అవుతుందని ఆయన వివరించారు. ఆ సమయంలోనే వృద్ధులు, వికంలాంగులకు దర్శనం కూడా త్వరగా అవుతుందని ఆయన వివరించారు.

ప్రోటోకాల్ దర్శనం చేసుకునే వారు కూడా ఉదయం 8 నుండి 10 గంటల మధ్య వస్తేనే బాగుంటుందని ఆయన వివరించారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వెయ్యాలని సీఎం మాకు ఆదేశాలు జారీ చేశారు అని తెలియజేశారు.

20 తారీఖు శుక్రవారం మూల నక్షత్రం రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మవారి దర్శనం కి వస్తారు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కొండకు చేరుకుంటారు పూర్ణకుంభం తో సీఎం ను స్వాగతించడం జరుగుతుందని తెలిపారు. తాను వస్తున్న రోజు క్యూ లైన్లు ఆపకుండా , భక్తులకు అసౌకర్యం కలిగించవద్దని సీఎం చెప్పినట్లుగా ఆయన వివరించారు,.

Advertisment
తాజా కథనాలు