అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి: మంత్రి కొట్టు!
సోమవారమే విజయ దశమి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని మంత్రి పేర్కొన్నారు. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచీ గురువారం వరకూ భవానీల తాకిడి ఉంటుంది.. హంసవాహనంలో తెప్పోత్సవం జరిగేప్పుడు 30 మందికే అవకాశం ఉందని మంత్రి అన్నారు.