పవన్ ను దారుణంగా ర్యాగింగ్ చేసిన జగన్.. బర్రెలక్క పేరు చెప్పి మరీ..

తెలంగాణలో జనసేన ఓటమిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడు పవన్ పార్టీకి రాలేదంటూ ఎద్దేవా చేశారు. తాను తెలంగాణలో పుట్టలేదనే బాధలో ఉన్నానంటూ డైలాగ్స్ వేసినా.. డిపాజిట్లు గల్లంతయ్యాయని విమర్శించారు సీఎం.

New Update
పవన్ ను దారుణంగా ర్యాగింగ్ చేసిన జగన్.. బర్రెలక్క పేరు చెప్పి మరీ..

CM Jagan Satires on Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఏపీ సీఎం జగన్(CM Jagan) ఘోరంగా ర్యాగింగ్ చేశారు. పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టినా తెలంగాణ(Telangana) ఎన్నికల్లో బోల్తా పడ్డారని ఎద్దేవా చేశారు. బర్రలక్కెకు వచ్చినన్ని ఓట్లు కూడా పార్టీకి రాలేదని సెటైర్లు వేశారు జగన్. గురువారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు సీఎం జగన్. పలాసలో వైఎస్ఆర్ సుజల ధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టును జాతికి అంకిత చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం జగన్.. పవన్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలతో పాటు.. సెటైర్లు వేశారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాభం మూటకట్టుకున్నారని జనసేనపై పంచ్‌లు వేశారు సీఎం జగన్. 'దత్తపుత్రుడు తెలంగాణలో అభ్యర్థులను పెట్టాడు. తెలంగాణలో పుట్టనందుకు తానా చాలా బాధపడుతున్నట్లు ఆ దత్తపుత్రుడు చెప్పాడు. ఇన్ని డైలాగులు కొట్టినా ఫలితం లేకుండా పోయింది. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఆ పార్టీకి రాలేదు' అంటూ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు సీఎం జగన్. హైదరాబాద్‌లో నివాసముండే పవన్ కల్యాణ్.. ఏపీ రాజకీయాలను నిర్ణయిస్తారట అని విమర్శించారు. పవన్ నాన్ లోకల్ అని.. ఆడపాదడపా రాష్ట్రంలో పర్యటిస్తారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారితో ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు సీఎం జగన్.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది. ఒక్క చోట కూడా ఆ పార్టీ గెలవ లేకపోయింది. కూకట్ పల్లిలో గెలుస్తామని భావించినా.. వారి ఆశలపై నీళ్లు చల్లారు ఓటర్లు. అయితే, ఒక్క కూకట్‌పల్లి మినహా మిగతా అన్ని చోట్లా డిపాజిట్ గల్లంతైంది.

Also Read:

రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!

భూ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు.. సీఎం రేవంత్ ఆదేశాలు..

Advertisment