Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయానికి యూపీ సర్కార్ నిధులపై యోగి ఆదిథ్యనాథ్ కామెంట్స్..

అయోధ్య రామాలయ నిర్మాణానికి యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆలయం కోసం ఖర్చు చేస్తున్న సొమ్ము దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు అందించారని తెలిపారు.

Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయానికి యూపీ సర్కార్ నిధులపై యోగి ఆదిథ్యనాథ్ కామెంట్స్..
New Update

CM Yogi Adityanath : మరో రెండ్రోజుల్లో ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో అయోధ్య(Ayodhya) తో పాటు దేశంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయితే రామ మందిరానికి యూపీ ప్రభుత్వంపై ఇచ్చిన విరాళంపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) ఓ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు తన ఎక్స్‌(Twitter)లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ' కరసేవకులు ఎన్నో త్యాగాలు చేశారు. దీనియ ఆర్‌ఎస్‌ఎస్‌(RSS) మార్గదర్శకత్వం, విశ్వహిందూ పరిషత్ నాయకత్వం, సాధువుల ఆశీర్వాదాలు తోడుగా నిలిచాయి.

Also Read: రూ. 1600 కోట్ల పెట్టుబడితో నిర్మించిన బోయింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ!

కరసేవకులు ఉద్యమం చేయడం వల్లే ఇప్పుడు అయోధ్యలోని రామజన్మభూమి(Ram Janmasthan) లో రామాలయ నిర్మాణం జరుగుతోంది. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు అందించలేదు. ఆలయం కోసం ఖర్చు చేస్తున్న సొమ్ము దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు అందించారని' యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

అయితే రామమందిరం బయట రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టు నిర్మాణం, గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం, రోడ్డు విస్తరణ, పార్కింగ్ సౌకర్యాల కోసం యూపీ సర్కార్ నిధులు అందిస్తోందని సీఎం తెలిపారు. ఇదిలాఉండగా.. దేశం నలుమూలల నుంచి అయోధ్య రామాలయానికి పెద్దఎత్తున విరాళాలు అందుతున్నాయి.

Also Read: అయోధ్య రామయ్య దర్శనం చేసుకోవాలంటే ఇవి తప్పక తెలుసుకోవాలి..

అంతేకాదు ఆలయానికి కానుకలు కూడా భారీగా వస్తున్నాయి. ప్రతిరోజూ 3 నుంచి 4 లక్షల రూపాయలు భక్తుల నుంచి విరాళంగా వస్తున్నట్లు తెలుస్తోంది. నెలకు రూ.1.5 నుంచి 2 కోట్ల వరకు నిధులు అందుతున్నాయి. ఇంకా ఆన్‌లైన్‌ విరాళాల లెక్కింపు ఇంకా జరగలేదన్నట్లు తెలుస్తోంది.

#ayodhya-ram-mandir #rss #up-cm-yogi-adityanath
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe