Telangana: రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వెంటనే ఏర్పాట్లు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు రెండ్రోజుల ముందే వర్సిటీ ఏర్పాటుకు స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని సూచించారు.

New Update
Runa Mafi: రెండో విడత రుణమాఫీ అప్పుడే చేస్తాం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు రెండ్రోజుల ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సూచించారు. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో ఆయన గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ డెవెలప్‌మెంట్ కార్యక్రమంపై సమావేశమయ్యారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతో పాటు ప్రముఖుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటీకీ అందుబాటులో ఉన్నందున సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సూచించారు.

Also Read: ముగిసిన నీట్‌ విచారణ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని.. అప్పటివరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని రేవంత్ నిర్ణయించారు. అలాగే స్కిల్ యూనివర్సిటీలో ఏమేం కోర్సులుండాలి, ఎలాంటి కరిక్యులమ్ ఉండాలి.. అటు పరిశ్రమల అవసరాలు కూడా తెలుసుకొని, వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేందుకు ఏయే నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలనేది ముందుగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అధునాతన పరిజ్ఞానం అందించేలా ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.

ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో.. అలాగే కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని చెప్పారు. నిర్ణీత గడువు పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించాలని, కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతీ అయిదు రోజులకోసారి సమావేశం కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలా.. ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టాలా... మరేదైనా విధానం అనుసరించాలా అనేది కూడా పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Also read: హెచ్‌ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్

యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని రేవంత్ సూచించారు. యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్ డిపార్టుమెంట్‌గా ఉంటుందన్నారు.ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌ను రేవంత్ పరిశీలించారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు కలియ తిరిగి అందులో ఉండే సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు