IR School : తెలంగాణ (Telangana) లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Integrated Residencial Schools) ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టివిక్రమార్క (Bhatti Vikramarka), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఇతర అధికారుల సమక్షంలో ఈ స్కూల్స్ ఏర్పాటుపై సుధీర్ఘ చర్చలు జరిపారు. ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఆర్కిటెక్చర్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు.
ఒకే చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ (Pilot Project) గా కొడంగల్, మధిర నియోజవర్గాల్లో ఈ స్కూల్లను ఏర్పాటు చేసేదిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దాదాపు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణంలో ఈ సమీకృత గురుకులాల సముదాయం ఏర్పాటు చేయనున్నారు. ఒకే చోట ఈ భవనాలు నిర్మించి మినీ ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : ఈరోజు ముఖ్యమైన 24 వార్తలు మీకోసం..