CM Revanth: తెలంగాణలో రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రెండో విడత రుణమాఫీ ప్రక్రియను జులై 31లోపు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆదివారం కల్వకుర్తి బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. అందులో ఒకటైన రైతు రుణమాఫీని దశల వారీగా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేశామని, రెండో దశ రుణమాఫీ రూ.1.5 లక్షలు జులై 31 లోగా అమలు చేస్తామన్నారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తన్నాని, తిరిగి రాగానే ఆగస్టు నెలలో రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
Also Read : ఒలింపిక్స్ విజేత మను భాకర్‌కు రాజకీయ ప్రముఖుల అభినందనలు