Runa Mafi: రెండో విడత రుణమాఫీ అప్పుడే చేస్తాం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన! రెండో విడత రైతు రుణమాఫీపై తెలంగాణ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రూ.1.5 లక్షల రుణమాఫీని జులై 31లోపు పూర్తి చేస్తామని తెలిపారు. విదేశీ పర్యటనకు వెళ్లిరాగానే ఆగస్టులో రూ.2 లక్షలు కూడా మాఫీ చేస్తామన్నారు. By srinivas 28 Jul 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth: తెలంగాణలో రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రెండో విడత రుణమాఫీ ప్రక్రియను జులై 31లోపు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆదివారం కల్వకుర్తి బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. అందులో ఒకటైన రైతు రుణమాఫీని దశల వారీగా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేశామని, రెండో దశ రుణమాఫీ రూ.1.5 లక్షలు జులై 31 లోగా అమలు చేస్తామన్నారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తన్నాని, తిరిగి రాగానే ఆగస్టు నెలలో రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. Also Read : ఒలింపిక్స్ విజేత మను భాకర్‌కు రాజకీయ ప్రముఖుల అభినందనలు #cm-revanth #rythu-runa-mafi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి