CM Revanth Reddy: ఏపీ సీఎం చంద్రబాబు లేఖపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు (AP CM Chandrababu) కూడా ఆయనకు లేఖ రాశారు. ఇటీవల ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే అరుదైన ఘనతను సాధించారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి సమావేశం అవుదామన్న మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకిభవిస్తున్నానని తెలిపారు.
Also Read: రాబోయే 15 ఏళ్లు బీఆర్ఎస్‌దే అధికారం.. ఎన్టీఆర్‌కు ఇలాగే జరిగింది: కేసీఆర్
విభజన సమస్య పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. ఈ సమావేశం విభజన సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో ఈ నేల 6వ తేదీన మధ్నాహ్నం సమావేశానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నానని రేవంత్ లేఖలో రాసుకొచ్చారు. ఇదిలాఉండగా.. రాష్ట్ర విభజన జరిగి ఇంకా చాలా సమస్యలు పెండిగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: మోదీకే చెమటలు పట్టించిన మొయిత్రా.. ఈ డైనమిక్ ఎంపీ బ్యాక్ గ్రౌండ్ ఇదే!