CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ అయిపోతుంది అనుకున్న పని రేపటికి కూడా వాయిదా పడడంతో ఆయన వరంగల్ టూర్ కూడా వాయిదా పడంది. ఢిల్లీలో పీసీసీ చీఫ్,క్యాబినెట్ విస్తరణ పై రేపు కూడా పార్టీ కాంగ్రెస్ పెద్దలతో చర్చలు కొనసాగనున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండిపోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.
ఇక రేపు జగాల్సిన వరంగల్ పర్యటన ఎల్లుండికి వాయిదా పడింది. అక్కడ రేపు అవ్వాలని కార్యక్రమాలు అన్నీ కూడా ఎల్లుండే జరగనున్నాయి. వరంగల్ సమగ్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, ఔటర్ రింగ్ రోడ్డు, మామునూరు ఎయిర్‌పోర్టు తదితర అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. వరంగల్ నగరాభివృద్ధికి ప్రణాళికలు రచించాలని ఇప్పటికే రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు డీపీఆర్ లు సిద్ధం చేశారు. ముందుగా పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం శాయంపేటలోని కాకతీయ మెగా జౌళి టెక్స్‌టైల్ పార్క్ ను ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత హన్మకొండలోని ఓ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం నయీమ్‌నగర్‌లోని నాలా పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించే రివ్యూ మీటింగ్ లో పాల్గొంటారు.
ఇదిలా ఉంటే.. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా మంత్రులు, MLA లు మరియు కలెక్టర్ల తో సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం సీఎం కు నివేదించనున్న పలు అంశాల పై సమావేశంలో చర్చించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, కాళోజీ కళాక్షేత్రం, మామునూరు ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో చేపట్టనున్న వనమహోత్సవం, మహిళాశక్తి కార్యక్రమం తదితర అంశాల పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమాలోచనలు చేశారు.
Also Read:andhra pradesh: గన్ మెన్ లును వెనక్కి పంపిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్