Mahalakshmi Scheme: వచ్చే నెల నుంచి మహిళలకు రూ.2,500!

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఎంపీ ఎన్నికలకు ముందే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ.2500 ఆర్థిక సాయాన్ని అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11న జరిగే కేబినెట్ భేటీలో ఈ పథకానికి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

Mahalakshmi Scheme: వచ్చే నెల నుంచి మహిళలకు రూ.2,500!
New Update

Mahalakshmi Scheme: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారెంటీలను అమలు చేసిన రేవంత్ సర్కార్ మరో గ్యారెంటీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ. 2,500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా ఈ పథకం అమలు కార్యాచరణ మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ పథకం పై కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ALSO READ: బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖరారు

ఈ నెల 12న కేబినెట్ భేటీ!..

ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ భేటీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు.. చేపట్టబోయే నూతన కార్యక్రమాలు.. అలాగే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి వర్గం చర్చించనుంది. అలాగే.. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెల నెల రూ.2500 ఇచ్చేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికలకు ముందు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం ఎన్నికల ముందు అమల్లోకి తేవడం వల్ల మహిళా ఓటర్ల ఓట్లు తమకే పడుతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందిరమ్మ ఇళ్లు కూడా..

ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద సొంత స్థలం ఉండి ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ పథకాన్ని మొదటగా నియోజకవర్గానికి 3,500 మంది అర్హులను ఎంపిక చేసి ఈ డబ్బు సాయాన్ని అందించనున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం రేవంత్ సర్కార్ మూడు నమూనాలను కూడా రెడీ చేసింది.

డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు...

తెలంగాణ మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపి కబురు అందించారు. ఈ నెల 12న ఇందిరా క్రాంతి పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం వల్ల మహిళలు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని మహిళలు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని అన్నారు. మహిళలను మహాలక్ష్మిలుగా చేయడమే తమ ప్రభుత్వం ఎజెండా అని అన్నారు.

#cm-revanth-reddy #congress-six-guarantees #mahalakshmi-scheme
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe