CM Revanth: త్వరలో దావోస్ కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి! జనవరి 15-19 మధ్య దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సదస్సులో భాగంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో సీఎం సమావేశం కానున్నారు. By V.J Reddy 29 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి సారిగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జనవరి 14-19 తేదీల మధ్య జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా హాజరు కానున్నారు. సమ్మిట్ కు కేంద్ర ప్రభుత్వం తరపున మాత్రమే కాక పలు రాష్ట్రాల నుంచి ముఖ్య మంత్రులు, మంత్రులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. రాష్ట్రం నుంచి సీఎం సహా పలువురు హాజరయ్యేది త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. ALSO READ: గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ ముసాయిదా షెడ్యూలు ప్రకారం ముఖ్యమంత్రి నేతృ త్వంలోని టీమ్ జనవరి 15న తెల్లవారుజామున బయలుదేరి తిరిగి 18న రిటర్న్ కానున్నట్లు సమాచారం. విదేశీ కంపెనీల ప్రతినిధులతో నాలుగు రోజుల పాటు జరిగే చర్చల్లో తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు వీరు చర్చలు జరపనున్నారు. గతేడాది సైతం జనవరి మూడో వారంలో జరిగిన టూర్ కు అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని టీమ్ పర్యటించింది. సుమారు రూ. 21 వేల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించినట్లు కేటీఆర్ అప్పట్లో ప్రకటించారు. విదేశీ కంపెనీలు తెలంగాణలో పారిశ్రామిక యూనిట్లను స్థాపించి ఇన్వెస్ట్మెంట్లు పెట్టేలా సీఎం నేతృత్వంలోని టీమ్ చర్చలు జరపనుంది. ఈసారి దావోస్ సమ్మిట్ కు ఎంచుకునే థీమ్. ఎజెండా అంశాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం త రాష్ట్ర ప్రభు విదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇవ్వనున్న రాయితీలు, కల్పించనున్న సౌకర్యాలు తదితర అంశాలను ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించి తెలంగాణలో కొత్త యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకునే అవకాశముంది. ఐటీ, ఫార్మా, బయో, ఏరోస్పేస్, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్లలో అనుసరిస్తున్న విధానాలు, విదేశీ పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యత తదితర అంశాలను వివరించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దోహదపడడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయనుంది. ALSO READ: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఎన్నంటే? #cm-revanth-reddy #telangana-congress #reavanth-davos-tour #telangana-investiments #telangana-it మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి