హైదరాబాద్ మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. నానక్‌రామ్‌గూడలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో.. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్‌తో పాటు పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. రేవంత్ మాట్లాడుతూ.. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ముందుగా మూసీ నది శుద్ధి చేపట్టాలని సూచనలు చేశారు. చారిత్రక కట్టడాలను కలుపుతూ మూసీ అభివృద్ధి ఉండేలా.. ప్రణాళిక రూపొందించాలని అన్నారు. అలాగే పని విభజన చేసి అభివృద్ధిపై కసరత్తును వేగవంతం చేయాలని సూచించారు.
Also Read: గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల
ఇదిలాఉండగా.. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: లోక్‌సభ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ! కసరత్తు మొదలుపెట్టిన సీఎం