Musi River: మూసీ నది శుద్ధి చేపట్టండి.. అధికారులకు రేవంత్ ఆదేశాలు మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ముందుగా మూసీ నది శుద్ధి చేపట్టాలని సూచనలు చేశారు. By B Aravind 19 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్ మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. నానక్‌రామ్‌గూడలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో.. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్‌తో పాటు పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. రేవంత్ మాట్లాడుతూ.. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ముందుగా మూసీ నది శుద్ధి చేపట్టాలని సూచనలు చేశారు. చారిత్రక కట్టడాలను కలుపుతూ మూసీ అభివృద్ధి ఉండేలా.. ప్రణాళిక రూపొందించాలని అన్నారు. అలాగే పని విభజన చేసి అభివృద్ధిపై కసరత్తును వేగవంతం చేయాలని సూచించారు. Also Read: గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల ఇదిలాఉండగా.. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. Also Read: లోక్‌సభ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ! కసరత్తు మొదలుపెట్టిన సీఎం #telugu-news #cm-revanth-reddy #musi-river మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి