Telangana: నళినికి మళ్లీ డీఎస్పీ పోస్టింగ్? సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై లాఠీ ఝుళిపించలేక తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళినికి మళ్లీ పోస్టింగ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆమెకు పోస్టింగ్ అంశాన్ని పరిశీలించాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana: నళినికి మళ్లీ డీఎస్పీ పోస్టింగ్? సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
New Update

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింపజేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

తెలంగాణ కోసం రాజీనామా..

దోమకొండ నళిని 2012లో తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న ఉద్యమకారులపై లాఠీలు ఝుళించలేనంటూ నళిని తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఏర్పడ్డాకే మళ్లీ ఉద్యోగం చేస్తానంటూ డీఎస్పీ పోస్టింగ్‌కు గుడ్ బై చెప్పేశారు. ఏకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేశారు. తెలంగాణ అంతటా పర్యటించారు. పరకాల ఉపఎన్నికలో పోటీ చేశారు. బీజేపీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆమె కనిపించలేదు. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. నళినికి పోస్టింగ్ ఇవ్వలేదు.

Also Read:

మావోయిస్టులకు బిగ్ షాక్.. ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతం..?

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..

#telangana #cm-revanth-reddy #ex-dsp-nalini #telangana-police-department
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe