CM Revanth Reddy: హైడ్రా కమిషనర్‌తో సీఎం అత్యవసర భేటీ.. వారిపై చర్యలకు ఆదేశాలు!

హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్లపై మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన వారిపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేయాలని సూచించారు. ఈ మీటింగ్‌కు హైడ్రా చీఫ్ రంగనాథ్ హాజరయ్యారు.

New Update
CM Revanth Reddy: హైడ్రా కమిషనర్‌తో సీఎం అత్యవసర భేటీ.. వారిపై చర్యలకు ఆదేశాలు!

HYDRA: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న డిమాండ్లపై మంత్రులతో చర్చించారు. హైడ్రాపై పలువురు కోర్టుకు వెళ్లడంతో తదుపరి కార్యాచరణపై మంత్రుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. అలాగే హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు విధివిధానాలు ఖరారు చేయడంతోపాటు చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన వారిపై కఠిన క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అయితే ఈ మీటింగ్‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ (Hydra Ranganath) కూడా హాజరవడం విశేషం. కాగా హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఈ మేరకు గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకొని కొంతమంది డబ్బులు అడుగుతున్నట్లు సమాచారం అందిదన్నారు. అమాయకులను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారని, రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారులపై కూడా ఫిర్యాదులున్నాయని తెలిపారు. అక్రమంగా డబ్బు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని, వసూళ్లు చేసే వారిపై నిఘా పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులకు సూచించారు.

Advertisment
తాజా కథనాలు