Indiramma Housing Scheme: ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద ఇళ్లు లేని అర్హులకు రూ.5 లక్షలు ఇవ్వనుంది. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

BREAKING: సొంత ఇళ్లు లేనివారికి రూ.5 లక్షలు.. కీలక ప్రకటన
New Update

Indiramma Housing Scheme: ఇళ్లు లేని వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఏర్పాట్లపై అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఇళ్లు లేని అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని.. ఇందుకోసం విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేయనుంది. అలాగే ఇంటి నిర్మాణానికి స్థలం లేని వారికీ కూడా స్థలం కేటాయించి రూ.5 లక్షలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

ALSO READ: మళ్లీ వారణాసి నుంచే బరిలోకి ప్రధాని మోడీ..195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల.

82 లక్షల దరఖాస్తులు?

ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్కువ దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఇందిరమ్మ ఇళ్ల కోసం 82 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే.. మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే అధికారిక ప్రకటన రాలేదు. 82 లక్షల దరఖాస్తులు అనేది అంచనా మాత్రమే. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదికి 4 లక్షల 16వేల 500 ఇళ్లు నిర్మించాలని కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ప్రతి నియోజకవర్గంలో 3, 500 ఇళ్లు నిర్మిస్తామని అసెంబ్లీ లోప్రభుత్వం ప్రకటించింది. 82 లక్షల మందిలో కనీసం 50 లక్షల మంది అర్హులు అనుకుంటే.. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మించినా పదేళ్లు పట్టే అవకాశం ఉందని అంచనా. ఐదేళ్లలోనే లబ్ధిదారులందరికీ ఇళ్లు అసాధ్యం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 82లక్షల దరఖాస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఎవరు?, లబ్ధి దారుల ఎంపిక ఎలా ఉండబోతోంది?, నియోజకవర్గంలో 3,500 మందిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు? ఇలా ఇందిరమ్మ ఇళ్లపై జనాల్లో ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

ALSO READ: బీఆర్ఎస్ మాజీ మంత్రి మిస్సింగ్?

#indiramma-indlu-scheme #indiramma-housing-scheme #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe