CM Revanth Reddy: మేము ఉరుకోము.. సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకలినైన భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రాంతేతరులు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమికొడతామని.. కేసీఆర్ పాలనలో పదేళ్ల తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని అన్నారు.

CM Revanth Reddy: మేము ఉరుకోము.. సీఎం రేవంత్ మాస్ వార్నింగ్
New Update

CM Revanth Reddy: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకలినైన భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రాంతేతరులు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమికొడతాం అని అన్నారు. ప్రజాభవన్ లో ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాము స్వర్ణజ్ఞానులం అన్న భ్రమ తమకు లేదని మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని అన్నారు. సామజిక న్యాయం మేడిపండు చందంగా మారిందని వ్యాఖ్యానించారు.

అధికారిక ఉత్తర్వులు, వాహనాల పేర్లకు TS బదులు TGగా మార్చినట్లు చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రాజీలేని కృషి చేస్తున్నామని అన్నారు. మొదటితేదినే ఉద్యోగులకు, పెన్షన్ దారులకు వేతనాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. మూసి సుందరీకరణ పథకం ద్వారా రూ. వెయ్యి కోట్లతో పరీవాహిక ప్రాంతం ఉపాధి కల్పన జోన్.. త్వరితగతిన రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తికి ప్రయత్నం చేస్తామని అన్నారు. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు పేర్కొన్నారు. ఇచ్చినట్లు తెలిపారు. పేదల కోసం నాలుగున్నర లక్షల ఇళ్లు కొరకు రూ.22,500 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు.

#cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe