CM Revanth: ఆగస్టు 25న స్వయంగా హాజరు కండి.. సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టు సమన్లు!

సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. కొత్తగూడెం సభలో బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆగస్టు 25న స్వయంగా హాజరు కావాలని స్పెషల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశించింది. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే.

CM Revanth: ఆగస్టు 25న స్వయంగా హాజరు కండి.. సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టు సమన్లు!
New Update

CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రికి హైదరాబాద్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆగస్టు 25న స్వయంగా హాజరు కావాలని స్పెషల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నోటీసులు పంపించింది. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందన్నారు. అయితే రేవంత్‌ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేశారు. అయితే ఈ కేసును కింది కోర్టు పలుమార్లు వాయిదా వేయడంతో వెంకటేశ్వర్లు హైకోర్టు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో రేవంత్ ను విచారణకు హాజరు కావాలంటూ హైదరాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారని అన్నారు. 100 ఏళ్లలో భారత్ ను హిందూ రాజ్యాంగ మార్చాలని 1925లో RSS ప్రతిజ్ఞ చేసిందని పేర్కొన్నారు. ఆ కుట్రలో భాగంగానే 2025లో భారత దేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చబోతున్నారని అన్నారు. అందుకే 2/3 మెజారిటీ కావాలని బీజేపీ నేతలు అడుగుతున్నారని అన్నారు. బీసీలు, ఓబీసీలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని.. రిజర్వేషన్లను రద్దు చేయమని బీజేపీ ఎందుకు చెప్పడం లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఈ కుట్రను తిప్పి కొట్టేందుకే కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని వ్యాఖ్యానించారు. 

రిజర్వేషన్లపై కేసీఆర్ విధానం అదే..
గతంలో కేసీఆర్ సీఎం పదవిలో ఉన్నప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చలని ఆయన అన్నారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే బీజేపీ విధానంలో భాగంగానే ఆ మాట అన్నారా? అని నిలదీశారు. రిజర్వేషన్లపై కేసీఆర్ విధానాన్ని ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ విధానం ఏంటో కేసీఆర్ స్పష్టం చేయాలని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 5 పార్లమెంట్ స్థానాలను కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఈటలకు వ్యతిరేకంగా కేసీఆర్ ఎక్కడా మాట్లాడలేదని పేర్కొన్నారు.

Also Read : జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. సబ్సిడీ ధరలకే గోధుమలు!

#cm-revanth #notice #hyderabad-court
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe