/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450552756_1029014885249785_5775598166067536258_n.jpg)
CM Revanth Reddy:హైదరాబాద్ లో హైడ్రా (Hydra) పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై సీఎం రేవంత్ స్పందించారు. గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.
ఎవరినీ ఉపేక్షించేది లేదు: ముఖ్యమంత్రి హెచ్చరిక
హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి @revanth_anumula గారు స్పందించారు.
గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కిందటి…
— CPRO to CM / Telangana (@CPRO_TGCM) August 29, 2024
Also Read: హైడ్రాకు మరిన్ని అధికారాలు.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు!