/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/REVANTH-6-jpg.webp)
CM Revanth Reddy: తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈ రోజు తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ కు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. అనంతరం రాహుల్ గాంధీ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మంత్రి పదవుల కేటాయింపుపై రాహుల్ తో చర్చించనున్నారు.
ALSO READ: కవిత, కేటీఆర్ జైలుకే.. సుఖేష్ చంద్రశేఖర్ బహిరంగ లేఖ
ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం ట్విట్టర్ (X) లో ఎమోషనల్ పోస్ట్ చేశారు సీఎం రేవంత్. ఆయన ట్విట్టర్ లో.. 'లోక్ సభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేశాను. ఈ రాజీనామా నా ఎంపీ పదవికి మాత్రమే… నా మనసులో మల్కాజ్ గిరి ప్రజల స్థానం శాశ్వతం. ప్రశ్నించే గొంతుకగా నన్ను పార్లమెంటుకు పంపిన ఇక్కడి ప్రజలతో నా అనుబంధం శాశ్వతం. చివరి శ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి.' అంటూ రాసుకొచ్చారు.
లోక్ సభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేశాను.
ఈ రాజీనామా నా ఎంపీ పదవికి మాత్రమే…
నా మనసులో మల్కాజ్ గిరి ప్రజల స్థానం శాశ్వతం.ప్రశ్నించే గొంతుకగా నన్ను పార్లమెంటుకు పంపిన ఇక్కడి ప్రజలతో నా అనుబంధం శాశ్వతం.
చివరి శ్వాస వరకు అటు కొడంగల్,
ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి.… pic.twitter.com/3HEC0XoBKq— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023
తెలంగాణ(Telangana) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజు నుంచే రేవంత్‌రెడ్డి(Revanth reddy) తన మార్క్ రూలింగ్‌ను స్టార్ట్ చేశారు. ప్రగతిభవన్ కంచెలను కూల్చేసి ప్రజలను లోపలకి అనుమతిస్తామన్న మాటను నిలబెట్టుకున్న రేవంత్.. ప్రజల సమస్యలను నేరుగా వింటున్నారు. ప్రగతిభవన్ పేరును ప్రజాభవన్‌గా మార్చి.. అందులో ప్రజా దర్బార్‌ని నిర్వహించిన రేవంత్‌కు సమస్యలు చెప్పుకునేందుకు సామాన్యులు పోటెత్తారు. ప్రజాభవన్ వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ALSO READ: నా ఫోన్ హ్యాక్ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు