CM Revanth: తులం బంగారం, రూ.లక్ష.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అన్నారు.

CM Revanth: తులం బంగారం, రూ.లక్ష.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
New Update

CM Revanth Reddy: బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాలపై ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, వివిధ శాఖల అధికారులు హాజరైయ్యారు. ఈ భేటీలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్. ప్రభుత్వ హాస్టల్స్ కు (Government Hostels) అవసరమైన పూర్తి బడ్జెట్ ను అంచనా వేయాలని సీఎం రేవంత్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అంచనా వ్యయం ఆధారంగా గ్రీన్ ఛానెల్ ద్వారా బడ్జెట్ విడుదల చేద్దామని అధికారులకు తెలిపారు. అలాగే అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకుల స్కూళ్ళ (Gurukula Schools) వివరాలు అందించాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన చోట సొంత భవనాలు నిర్మించేందుకు భూమిని గుర్తించాలని అధికారులను సీఎం రేవంత్ కోరారు.

ALSO READ: ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం.. డేట్స్ ఫిక్స్

తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో ఒకటైన కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi Scheme), షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను కోరారు. రూ.లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు ఇచ్చారు. లోక్‌ సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని.. నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ ఏర్పాటు చేయడం ద్వారా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మరింత ప్రయోజనంకలుగుతుందని అందుకోసం బడ్జెట్ ను రూపొందించాలని సీఎం రేవంత్ అన్నారు.

ఫిబ్రవరిలో మరో రెండు గ్యారెంటీలు..

తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ గ్యారెంటీల అమలుపై కార్యాచరణ చేపట్టింది. ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ సభ సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో మరో రెండు గ్యారెంటీలు అమలు అవుతాయని అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు బంధు ఫిబ్రవరి నెలాఖరులోగా రైతుల ఖాతాలో జమ చేస్తామని అన్నారు. అందులో ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు రూ.2500 పెన్షన్ ఉండనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

రెండ్రోజుల్లో రెండు..

తెలంగాణ పగ్గాలను సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండో రోజే ఆరు గ్యారెంటిలోని రెండు హామీలను అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు వంటి రెండు పథకాలను అమల్లోకి తెచ్చారు. అయితే.. ఉచిత బస్సు ప్రయాణానానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అయితే.. మిగితా హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.

DO WATCH:

#cm-revanth-reddy #rythu-runamafi #2024-lok-sabha-elections #kalyana-lakshmi-scheme #shadi-tofa-funds
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe