CM Revanth Reddy: కోదండరాంను ప్రశ్నించేంత పెద్దోళ్లా?.. కుట్రతోనే అడ్డుకున్నారు.. మండపడ్డ సీఎం రేవంత్‌

చట్టసభకు వెళ్లకుండా కోదండరాంను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ కుట్రలు పన్నిందంటూ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమసారథిగా నిలిచిన కోదండరాం గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపికను ప్రశ్నించడం భావదారిద్ర్యమే అవుతుందన్నారు.

New Update
CM Revanth Reddy: కోదండరాంను ప్రశ్నించేంత పెద్దోళ్లా?.. కుట్రతోనే అడ్డుకున్నారు.. మండపడ్డ సీఎం రేవంత్‌

CM Revanth Reddy: చట్టసభకు వెళ్లకుండా కోదండరాంను (Prof Kodandaram) అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ (BRS) కుట్రలు పన్నిందంటూ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమసారథిగా నిలిచిన కోదండరాం గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపికను ప్రశ్నించడం భావదారిద్ర్యమే అవుతుందన్నారు. రాజీకీయ కుట్రతోనే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని (MLC Oath) వాయిదా వేయించారని ఆరోపించారు. కేసీఆర్‌ (KCR) దొడ్లో చెప్పులు మోసిన వారితో కోదండరాంను పోల్చవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలోనే ప్రజల్లోకి వస్తానని స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి

తెలంగాణ హక్కులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు .  ‘‘పునర్‌విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ వంటి ప్రాజెక్టుల గురించి అసలు పట్టించుకోలేదన్నారు. బ్లాక్ మనీ వెనక్కు తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని మాటతప్పారంటూ మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పి మాటలకే పరిమితమయ్మాయారన్నారు. రాష్ట్రంలో పండిన వరిని కూడా కొనలేని స్థితిలో కేంద్రం ఉందన్నారు.

ఇది కూడా చదవండి: ఆపరేషన్‌ ఏపీ.. చిరంజీవిని రాజ్యసభకు పంపే ప్లాన్? బీజేపీ స్ట్రాటజీ ఇదేనా?

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంపైనే బీజేపీ దృష్టి పెట్టిందంటూ సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. ప్రధాని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటికీ అమలు కాలేదని దుయ్యబట్టారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ చేసినట్టుగానే, కేంద్రంలో మోదీ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారానే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారని సీఎం విమర్శించారు.

Advertisment
తాజా కథనాలు