CM Revanth: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడికి అస్వస్థత

సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అస్వస్థతకు గుయారైయ్యారు. ఆయనకు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు.

New Update
CM Revanth: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడికి అస్వస్థత

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అస్వస్థతకు గుయారైయ్యారు. హైదరాబాద్‌లో ఉండగా తిరుపతి రెడ్డి అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన్ను మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన తిరుపతి రెడ్డికి యాంజియోగ్రామ్‌ చేసిన వైద్యులు.. గుండె నరాల్లో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించారు. వెంటనే ఆయన గుండెకు స్టంట్‌ వేశారు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న రేవంత్‌ తమ్ముడు కొండల్‌రెడ్డి మెడికవర్‌ ఆస్పత్రికి వచ్చి సోదరుడి వైద్య సేవల్ని పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ALSO READ: లోక్ సభ ఎన్నికల వేళ కేసీఆర్‌కు బిగ్ షాక్!

మల్కాజ్ గిరి ఎంపీ గా తిరుపతి రెడ్డి...

రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరందుకుంది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ మల్కాజ్ గిరి లో తిరుపతి రెడ్డి పేరుతో అక్కడి కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. గతంలో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా ఎన్నిలకైనా రేవంత్ రెడ్డి ఈసారి అదే సీటును తన సోదరుడు తిరుపతి రెడ్డికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడిచింది. ఇదిలా ఉండగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ లో చేరిన హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మల్కాజ్ గిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ టికెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్ లో చేరారని ప్రచారం జరుగుతోంది. దేశంలో అతి పెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి ఇస్తుందో వేచి చూడాలి.

నా కుటుంబ సభ్యులు రాజకీయాలకు దూరం: సీఎం రేవంత్ 

ఇటీవల మీడియాతో జరిగిన చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడికి ఎంపీ టికెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. తన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎవరు రారు అని తేల్చి చెప్పారు. తన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ.. ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి పదవులు, బాధ్యతలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి కొందరు లబ్ది చెందుతున్నారని సీఎం అన్నారు.

Advertisment
తాజా కథనాలు