Sun Burn: బుక్‌ మై షోపై కేసు నమోదు.. సన్‌బర్న్‌ ఈవెంట్‌పై రేవంత్‌ ఆగ్రహం!

సన్‌బర్న్‌తో పాటు బుక్‌ మై షోపైనా కేసు నమోదు చేశారు పోలీసులు. సన్‌బర్న్‌ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించినా టికెట్ల విక్రయం ఆగకపోవడంతో రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక యువత పెడదోవ పట్టే ఈవెంట్లకు అనుమతి లేదని ప్రభుత్వం ఖరాఖండిగా చెబుతోంది.

Sun Burn: బుక్‌ మై షోపై  కేసు నమోదు.. సన్‌బర్న్‌ ఈవెంట్‌పై రేవంత్‌ ఆగ్రహం!
New Update

SUNBURN NYE 2024: న్యూ ఇయర్‌(New Year) సందర్భంగా సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్ కోసం బుక్‌మైషో(BookMyShow) పోర్టల్ ద్వారా టిక్కెట్లు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సన్‌బర్న్‌ ఫెస్టివల్‌కు నిర్వాహకులు అనుమతి తీసుకోనప్పటికీ బుక్‌ మై షోలో టికెట్ల విక్రయాలు జరగడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై విచారణ జరపాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మొహంతీని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు రేవంత్‌. పోలీసుల అనుమతి లేకుండా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్(బుక్‌ మై షో) టిక్కెట్లను ఎలా విక్రయిస్తోందని రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) విస్మయం వ్యక్తం చేశారు. '18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఇలాంటి కార్యక్రమాలకు అనుమతించకూడదని.. అదేవిధంగా, 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారికి ఎక్కడా మద్యం అందించకూడదని' ఆయన స్పష్టం చేశారు.

యువత పెడదోవ పడతారనే ఆలోచనతోనే:
సన్‌బర్న్‌(SunBurn)తో పాటు బుక్‌ మై షోపైనా కేసు నమోదు చేశారు. పోలీసులు హెచ్చరించినా టికెట్ల విక్రయం ఆపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా సన్‌బర్న్‌షో ఏర్పాటు చేశారు. బుక్‌ మై షోలో టికెట్ల విక్రయం జరగగా.. జెంట్స్‌కు రూ.2,500, మహిళలకు రూ.2,300గా టికెట్‌రేట్‌ నిర్ణయించారు. ఓ స్టార్‌ హోటల్‌లో సన్‌బర్న్‌ ఈవెంట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులు అనుమతి నిరాకరించినా టికెట్ల విక్రయం ఆగకపోవడంతో సన్‌బర్న్‌ ఈవెంట్‌పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా టికెట్లు ఎలా విక్రయిస్తున్నారంటూ ప్రశ్నించారు. అన్‌లిమిటెడ్‌ లిక్కర్‌ వల్ల యువత పెడదోవ పడతారనే ఆలోచనలో ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారు పోలీసులు. ఇప్పటికే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించిన సీఎం రేవంత్‌.. సన్‌బర్న్‌ ఈవెంట్ల ద్వారా డ్రగ్స్‌ వినియోగం పెరిగే ఛాన్స్‌ ఉంది. యువత పెడదోవ పట్టే ఈవెంట్లకు అనుమతి లేదని ప్రభుత్వం ఖరాఖండిగా చెబుతోంది.

నూతన సంవత్సర వేడుకలను ఆదాయ వనరుగా చూడవద్దని అధికారులను రేవంత్‌ కోరారు. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక సన్‌బర్న్‌ లాంటి కార్యక్రమాలను నిషేధించాయని గుర్తు చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరస్తులతో కాదు.. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని సీఎం అన్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చిన రేవంత్‌రెడ్డి, ఈ కార్యక్రమంలో నార్కోటిక్‌ బ్యూరో కీలక పాత్ర పోషించాలన్నారు. 'పంజాబ్‌కు ఏం జరిగిందో మాకు తెలుసు. తెలంగాణ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది. డ్రగ్స్ ముప్పు గురించి నా దగ్గర సమాచారం ఉంది. నా ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలి' అని సీఎం అన్నారు.

Also Read: ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు.. మరి రోహిత్ చరిత్ర సృష్టిస్తాడా? 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా?

WATCH:

#cm-revanth-reddy #revanth-reddy #book-my-show #sun-burn
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe