కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ్యులకు తీర్మానం ప్రతులు అందజేశారు. తెలంగాణకు బడ్జెట్ కేటాయిస్తూ రీబడ్జెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఏమివ్వాలో విభజన చట్టంలోనే ఉందని.. ఏమీ ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ రేవంత్ మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం చేసింది ఏమి లేదంటూ దుయ్యబట్టారు.
Also Read: రేపు అసెంబ్లీకి కేసీఆర్
మరోవైపు రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు ఢిల్లీలో దీక్ష చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు చేసిన డిమాండ్‌పై కూడా రేవంత్ స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్ధమని ప్రకటిస్తామన్నారు. విపక్ష నేతగా కేసీఆర్ వస్తే.. ప్రభుత్వాధినేతగా తాను వస్తానని చెప్పారు. రాష్ట్రానికి నిధుల కోసం కేసీఆర్ ముందుకు రావాలన్నారు. మీరు తేదీ నిర్ణయించండి.. మేము దీక్షకు సిద్ధమంటూ స్పష్టం చేశారు.