CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి ప్రాజెక్ట్, భద్రాద్రి ప్రాజెక్టు, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందాలపై జ్యూడీషియల్ విచారణ చేస్తామని అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ సభ ముందు వాస్తవాలు బయటపెట్టలేదని అన్నారు. విద్యుత్ శాఖను పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసి.. వాస్తవాలను ప్రజల ముందు పెట్టాం అని తెలిపారు. జగదీష్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం అని అన్నారు. విద్యుత్‌పై జ్యూడీషియల్ విచారణకు సిద్ధంగా ఉన్నాం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కరెంట్ అనే సెంటిమెంట్‌ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుంది అని మండిపడ్డారు.
ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్!
ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ప్రశ్నించిన మమ్మల్ని ఆనాడు మార్షల్స్ చేత బయటకు గెంటించారని ఫైర్ అయ్యారు. ఉద్యమంలో పని చేసిన తెలంగాణ విద్యుత్ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారని పేర్కొన్నారు. రెండేళ్లలో భద్రాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, ఏడేళ్లు పట్టిందని అన్నారు. భద్రాద్రి ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్. ప్రాజెక్టు కోసం గ్లోబల్ టెండర్లు పిలవలేదని అన్నారు. బ్యాక్ డోర్ నుంచి టెండర్లు అంటగట్టారని ఫైర్ అయ్యారు.
ALSO READ: అరెస్ట్ తరువాత పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడంటే..
మూడు అంశాలపై విచారణకు ఆదేశిస్తామని రేవంత్ సభ ముఖంగా తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తున్నాం అని అన్నారు. రెండో అంశంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ పై విచారణ చేర్చమని, మూడో అంశంగా యాద్రాద్రి పవర్‌ప్లాంట్ పైనా విచారణ జరిపిస్తాం అని తేల్చి చెప్పారు. మొత్తం వాస్తవాలకు బయటకు తీయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ సవాల్ మేరకు జ్యుడీషియల్ విచారణకు ఆదేశం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్లను కూడా చేరుస్తామని అన్నారు. మీ ఉద్దేశాలు ఏంటో విచారణలో తేలుతాయని బీఆర్ఎస్ నేతలకు హెచ్చరించారు. ప్రభుత్వం రంగంలో విద్యుత్ విషయంలో బీఆర్‌ఎస్ సాధించింది గుండు సున్నా అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదని అన్నారు. ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదని అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అంటూ అబద్ధాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. సభలో దబాయిస్తూ ఇంకా ఎంత కాలం గడుపుతారు? అని అన్నారు. కోమటిరెడ్డి లాక్‌బుక్ చూపిస్తే.. బుక్‌లు మాయం చేశారు.. ఇంకా ఎన్నాళ్లూ మోసం చేస్తారు? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.