CM Revanth: రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ.. దానిపైనే సుధీర్ఘ చర్చ!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. క్యాబినెట్ విస్తరణ, కొత్త ఎమ్మెల్యేల చేరిక, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఆపరేషన్ ఆకర్ష్‌పైనా కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

New Update
CM Revanth: రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ.. దానిపైనే సుధీర్ఘ చర్చ!

Delhi: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో క్యాబినెట్ విస్తరణ, కొత్త ఎమ్మెల్యేల చేరిక, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పోచారంతో కలిసి AICC ఆఫీస్‌కు కేబినెట్‌ లిస్ట్‌తో వెళ్లిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీలు రాహుల్ గాంధీకి వివరించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌పైనా చర్చలు జరిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు చేరగా.. మరికొంత మందిని చేర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపికపైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు