Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం.. వారికే ఇస్తామన్న రేవంత్!

తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముణుగూరు వేదికగా సీఎం రేవంత్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అర్హులైన మహిళల పేరుమీదనే ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్నారు. ఖమ్మం ప్రజలు కేసీఆర్ ను నమ్మరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

New Update
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం.. వారికే ఇస్తామన్న రేవంత్!

Indiramma Indlu Scheme: తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలం జిల్లా ముణుగూరు వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth Reddy) ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అర్హులైన మహిళల పేరుమీదనే ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్నారు. ఖమ్మం ప్రజలు కేసీఆర్ ను నమ్మరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అద్భుతమైన మోడల్..
ఈ మేరకు 400 గజాల్లో అధ్బుతమైన మోడల్ లో ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. సొంత స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. రెండు బెడ్ రూమ్స్, హాల్, కిచెన్, వాష్ రూమ్, కౌంపౌండ్ వాల్ నిర్మించగా దీనికి జాతీయ జెండాలో మూడు రంగులు వేయనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లపై (Indiramma Indlu Scheme) అభయహస్తం ముద్ర కూడా ఉంటుందని స్పష్టం చేశారు. విశాలంగా ఇండ్లు నిర్మించుకునేలా ప్లాన్ చేసినట్లు ఆయన తెలిపారు. 4 దశల్లో ఇండ్లు పూర్తి చేసుకునేలా రుణం అందజేస్తామన్నారు.

ఇది కూడా చదవండి: TS: యాదాద్రి సాక్షిగా భట్టికి అవమానం.. రేవంత్ పై విమర్శలు!

పేద వారితో ఆటలాడుకున్నారు..
అలాగే మాజీ సీఎం కేసీఆర్ పై ఈ సభ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. పేద వారితో కేసీఆర్ ఆటలాడుకున్నారని మండిపడ్డారు. 2014, 2018లో కేసీఆర్ ప్రభుత్వం ఖమ్మంలో ఒకే సీటు గెలిచిందని, ఖమ్మం ప్రజలు కేసీఆర్ ను ఎప్పటికీ నమ్మరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటూ ముందుకెళ్తుందని, ప్రజా ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.

పేదల ఆత్మగౌరవానికి ప్రతీక..
'ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. రూ. 400 సిలిండర్ ను కేంద్రం రూ.1200 చేసింది. మేము రూ. 500 లకే అందిస్తున్నాం. త్వరలోనే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నాం. మహిళల పేరుమీదనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. పేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్లు ప్రతీక అంటూ పలు విషయాలపై మాట్లాడారు.

Advertisment
తాజా కథనాలు