CM Revanth: అధికారం పోయినా బలుపు తగ్గలేదు.. సెక్రటేరియట్ ముందు మీ అయ్య విగ్రహం పెట్టుకుంటావా!

అధికారం పోయినా బీఆర్ఎస్‌ నేతలకు బలుపు తగ్గలేదని సీఎం రేవంత్ అన్నారు. సెక్రెటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కూల్చివేస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయాలంటూ సీఎ రేవంత్ సవాల్ చేశారు.

New Update
CM Revanth: అధికారం పోయినా బలుపు తగ్గలేదు.. సెక్రటేరియట్ ముందు మీ అయ్య విగ్రహం పెట్టుకుంటావా!

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తెలంగాణ సెక్రెటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే భవిష్యత్తులో కూల్చివేస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని రేవంత్ అన్నారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు. కానీ సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదని చెప్పారు. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదని, అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయాలంటూ సీఎ రేవంత్ సవాల్ చేశారు.

ఇది కూడా చదవండి: Harish Rao-Mynampalli: సిద్దిపేటలో హైటెన్షన్.. మైనంపల్లి Vs హరీష్ రావు!

మీకు అధికారం ఇక కలనే..
అలాగే.. కేటీఆర్ నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నావ్.. బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే. ఇక మీరు చినతమడకకే పరిమితమంటూ కౌంటర్ వేశారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని, డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమదని చెప్పారు. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదు. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుందని సీఎం రేవంత్ హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు