Congress First List: ఢిల్లీలో సీఎం రేవంత్.. 9 మందితో తొలి జాబితా?

ఢిల్లీ పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో నాలుగు రాష్ట్రాల ఎంపీ అభ్యర్థులపై చర్చించనున్నారు. ఈరోజు 9 మందితో కూడిన తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.

New Update
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్‌తో భేటీ

Congress First List : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తో కలిసి ఢిల్లీ(Delhi) కి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఈరోజు ఢిల్లీలో జరిగే ఏఐసీసీ కార్యాలయంలో జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో(Congress Central Election Committee Meeting) పాల్గొననున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. తెలంగాణ(Telangana) తో సహా మరో నాలుగు రాష్ట్రాల ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరపనున్నారు. తెలంగాణ ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ కు అభ్యర్థులను లిస్టును టీ కాంగ్రెస్ నేతలు పంపినట్లు సమాచారం. ముందుగా ఏకగ్రీవంగా ఎంపికైన అభ్యర్థులను మొదటగా ప్రకటించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: పదో తరగతి పరీక్ష హాల్ టికెట్లు విడుదల

9 మందితో తొలి జాబితా..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే జోష్ ను లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ తో భేటీ అనంతరం ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 9 మందితో తొలి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈరోజు ప్రకట చేయకపోతే మరో రెండ్రోజుల్లో ఎంపీ అభ్యర్థుల ప్రకట ఉండే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆ 9 మంది వీరేనా?

* కరీంనగర్- ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి,
* నిజామాబాద్ – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,
* పెద్దపల్లి – గడ్డం వంశీ,
* జహీరాబాద్ – సురేశ్​ షెట్కార్,
* చేవెళ్ల – సునీతా మహేందర్‌ రెడ్డి,
* సికింద్రాబాద్ – బొంతు రామ్మోహన్,
* నల్గొండ – జానారెడ్డి / పటేల్ రమేష్ రెడ్డి.
* మహబూబ్‌నగర్‌ – వంశీచంద్‌ రెడ్డి.
* నాగర్ కర్నూల్ - సంపత్/ మల్లు రవి.

ALSO READ: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడికి అస్వస్థత

గమనిక: పైన ఉన్న పేర్లు అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించలేదు. కేవలం ఆశావహుల పేర్లు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారంగా చెప్పినవే.

Advertisment
తాజా కథనాలు