IITH : ఐఐటీహెచ్‌లో అడ్మిషన్లకు సీఎం రేవంత్ ఆమోదం పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌లో ఏర్పాటు చేయబోయే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IITH) సంస్థలో డిప్లోమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. By B Aravind 22 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి IITH Admissions : పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ (Pochampally Handloom Park) లో ఏర్పాటు చేయబోయే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IITH) సంస్థలో డిప్లోమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. 2024-25 ఏడాదికి మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునీకరణకు, నేతన్నలకు సాయం అందించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి కేటాయించిన రూ.400 కోట్ల బడ్జెట్‌ను వినియోగించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. Also Read: జూన్ మొదటి వారంలోగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు! టెస్కో ద్వారా శానిటరీ నాప్కిన్ల తయారీ పరిశ్రమను పోచంపల్లిలో నెలకొల్పేందుకు కూడా సీఎం అంగీకరించారని చెప్పారు. ఇక బాలికలు రుతుక్రమ సమయంలో స్కూల్‌కు హాజరుకాకపోవడాన్ని తగ్గించేందుకు శానిటరీ నాప్కిన్లు స్వయం సంఘాల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ శాఖల నుంచి టెస్కోకు రావాల్సిన బకాయిలను విడుదల చేసేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్.. అంగీకరించినట్లు తుమ్మల స్పష్టం చేశారు. Also read: IPL: ఫైనల్ కు చేరిన కేకేఆర్..హైదరాబాద్ మీద ఘన విజయం! #telugu-news #revanth-reddy #handloom #iith మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి