CM Revanth : రేవంత్ సర్కారుకు బిగ్ షాక్..!

తెలంగాణ హైకోర్టులో రేవంత్ సర్కారుకు బిగ్ షాక్ తగిలింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటిషన్‌పై హైకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్ నియమిస్తూ ఇచ్చిన గెజిట్‌ను కొట్టివేసింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

New Update
CM Revanth : రేవంత్ సర్కారుకు బిగ్ షాక్..!

CM Revanth : తెలంగాణ హైకోర్టు(Telangana High Court) లో రేవంత్ సర్కారు(Revanth Sarkar) కు బిగ్ షాక్ తగిలింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటిషన్‌పై హైకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్ నియమిస్తూ ఇచ్చిన గెజిట్‌ను కొట్టివేసింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ నామినేషన్లను తిరస్కరిస్తూ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. గవర్నర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఎమ్మెల్సీల నియామకంపై పున:సమీక్షించుకోవాలని స్పష్టం చేసింది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం(Kodandaram), అమీర్‌ అలీఖాన్(Amir Ali Khan) నియమాకాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు చేసిన అభ్యర్థనపై హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. అదే సమయంలో మంత్రి మండలి నియమకానికి గవర్నర్(Governor) కట్టుబడి ఉండాలని హైకోర్టు సూచించింది. ఇదిలా ఉండగా, గవర్నర్ కోటా కింద తమ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిన గవర్నర్ చర్యను సవాల్ చేస్తూ గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వంలోని ఇద్దరు ఎమ్మెల్సీ నామినీలు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌ పేర్లను ప్రతిపాదించింది. గవర్నర్ తమిళిసై సైతం అందుకు ఆమోదం తెలిపారు. ప్రభుత్వం వారిని ఎమ్మెల్సీలుగా నిమమిస్తూ గెజిట్ విడుదల చేసింది.

Also Read : ‘చేవలేక, చేతకాక..’ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య ‘కరువు’ యుద్ధం!

అయితే, ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాన్ని బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయగా.. దానిని గవర్నర్ తిరస్కరించడంపై తాము దాఖలు చేసిన పిటిషన్ విచారణలో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆ పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టును విజ్ఞప్తి చేశారు. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల ప్రమాణ స్వీకారంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు