Rythu Bandhu: రైతు బంధు ఇప్పట్లో లేనట్లే.. రేవంత్ షాకింగ్ ప్రకటన తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ షాక్ ఇచ్చారు. ఇటీవల రైతు బంధు నిధులను ఈ నెలలోనే రైతుల ఖాతాలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు నిధులు FEB నెలాఖరుకు జమ చేయనున్నట్లు తెలిపారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By V.J Reddy 25 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rythu Bandhu: రైతు బంధు డబ్బుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) షాక్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా జనవరి నెలాఖరులోపు రైతు బంధు వేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పగా.. తాజాగా రైతు బంధు జమపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతు ఖాతలో రైతు బంధు డబ్బును జమ చేస్తామని అన్నారు. వచ్చే సీజన్ నుంచి రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని అన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ లాగా హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఉండదని అన్నారు. ALSO READ: మాజీ సీఎం కేసీఆర్‌కు షాక్! కార్యకర్తలు ఇచ్చినవే.. కార్యకర్తల శ్రమవల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యకర్తల కష్టం వల్లే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడని పేర్కొన్నారు. తన పదవి, హోదా కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చినవే అని అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతోనే కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. త్యాగమంటే నెహ్రూ కుటుంబానిదే.. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. 18 ఏళ్ల యువత ఈరోజు ఓటు వేస్తున్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ అని అన్నారు. నేను గుంపు మేస్త్రినే.. బీఆర్ఎస్ పార్టీ నేతలు తనను గుంపు మేస్త్రి అంటూ సంబోదించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అవును నేను మేస్త్రీనే అని అన్నారు. తెలంగాణను పునర్‌నిర్మించే మెస్ట్రీనే అని బీఆర్ఎస్ పవర్ ఫుల్ పంచ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ గోరి కట్టేందుకు వచ్చిన మేస్త్రిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా సరిగ్గా కాలేదని.. అంతలోపు ఎదో అయిపోతుందని.. ఇచ్చిన హామీలు అమలు కావడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లపై కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. DO WATCH: #cm-revanth-reddy #rythu-barosa #rythu-bandhu #telangana-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి