Revanth Reddy : నా మాటలు వక్రీకరించారు... సుప్రీం సీరియస్‌ అవ్వడం పై రేవంత్‌!

తనకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని.. సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ స్పష్టం చేశారు. తన వాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

Supreme Court: రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్
New Update

Supreme Court : ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు (Delhi Liquor Scam Case) లో బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కు బెయిల్‌ రావడం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సుప్రీం కోర్టు ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని గురించి రేవంత్ తన ఎక్స్‌ వేదికగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆయన వివరించారు.

నాకు న్యాయ వ్యవస్థ పై అపారమైన నమ్మకం ఉందని...సుప్రీం తీర్పును తప్పుపట్టే ఉద్దేశం తనకు లేదని తెలియజేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడం పై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్‌ ఇవ్వడం పై బుధవారం రేవంత్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల మీద సుప్రీం తీవ్రంగా స్పందించింది.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలుఇవి కాదని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఆయన న్యాయస్థానానికి ఉద్దేశాలను ఆపాదించినట్లు వ్యాఖ్యానించారని పేర్కొంది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం మధ్యాహ్నం వాదనల సందర్భంగా ధర్మాసనం కవితకు బెయిల్‌ ఇవ్వడంపై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది.

‘తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం బీఆర్‌ఎస్‌ పని చేసిందని, బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య కుదిరిన ఈ ఒప్పందం వల్లే కవితకు బెయిల్‌ వచ్చిందని సీఎం కామెంట్‌ చేశారు’’ అని కవిత తరఫున్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ వ్యాఖ్యలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దీంతో సుప్రీం ధర్మాసనం సీఎం రేవంత్‌ (Revanth Reddy) ని తీవ్రంగా మందలించింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయి స్పందిస్తూ... ‘‘ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రజల ఆలోచనల్లో భయాలు రేకెత్తే అవకాశాలున్నాయి. రాజకీయ నాయకులను సంప్రదించి మేము తీర్పులు ఇస్తున్నామా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘న్యాయమూర్తులుగా మేం ప్రమాణం చేస్తాం. మనస్సాక్షిగానే మా విధిని నిర్వర్తిస్తాం’’ అని పేర్కొన్నారు.

మరో న్యాయమూర్తి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ జోక్యం చేసుకొని... ‘‘ఇది ఒక సీఎం హోదాలో ఉన్న బాధ్యత గల వ్యక్తి మాట్లాడాల్సిన మాటాలా? రాజ్యాంగంలోని ఇతర సంస్థల పట్ల పరస్పర గౌరవం ఉండాలని ప్రాథమిక కర్తవ్యం చెప్పలేదా? గౌరవం కలిగి ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. మరోసారి జస్టిస్‌ గవాయి అసంతృప్తి వ్యక్తం చేస్తూ... చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోబోమని, అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా తాము అదే ఆశిస్తామని వివరించారు.

Also Read: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం

#kavitha #revanth-reddy #supreme-court
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి