కిర్గిస్థాన్‌లో జరిగిన అల్లర్లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కేక్‌లో ఉన్న భారత రాయబారితో మాట్లాడారు.అయితే అక్కడ జరిగిన ఘటనల్లో భారతీయ విద్యార్థులు ఎవరూ కూడా గాయపడలేదని.. అందరూ క్షేమంగానే ఉన్నారని రాయబారి స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల్లో నిజం లేదని పేర్కొన్నారు.
Also read: రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు.. బెంగళూరులోనే హేమ
ఇదిలాఉండగా.. బిష్కెక్‌లో గత రెండు మూడు రోజుల నుంచి భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ స్టూడెంట్స్ ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరగడం కలకలం రేపాయి. ఈ గొడవలకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వైద్య విద్య కోసం కిర్గిస్థాన్‌కు వెళ్లినవారు ఉన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్న వేళ.. సీఎం రేవంత్ రేవంత్ విద్యార్థుల గురించి ఆరా తీశారు.
Also read: డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్..