/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet.jpg)
TG News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, తక్షణ సహాయక చర్యలు చేపట్టామని రేవంత్ చెప్పారు. ఖమ్మంలో ఎక్కువగా నష్టం సంభవించిందని రేవంత్ తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సేవలు అందించేందుకు హెలికాప్టర్లు తెలంగాణకు పంపిస్తామని మోదీ చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించిన తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగాన్ని మోదీ అభినందించారు.