CM Nitish Kumar: నితీష్‌ కుమార్‌ను రెండో గాంధీగా పోలుస్తూ పోస్టర్లు.. విపక్షాలు ఏమన్నాయంటే..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను మహాత్మగాంధీతో పోలుస్తూ.. వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. అలాంటి వ్యక్తిని మహాత్మగాంధీతో పోల్చడం అవమానించడమేనని ఆర్జేడీ పార్టీ విమర్శలు గుప్పించింది. మరోవైపు ఇది హేయమైన చర్య అంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

CM Nitish Kumar: నితీష్‌ కుమార్‌ను రెండో గాంధీగా పోలుస్తూ పోస్టర్లు.. విపక్షాలు ఏమన్నాయంటే..
New Update

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను మహాత్మగాంధీతో పోలుస్తూ.. వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. అలాంటి వ్యక్తిని మహాత్మగాంధీతో పోల్చడం అవమానించడమేనని ఆర్జేడీ పార్టీ విమర్శలు గుప్పించింది. మరోవైపు ఇది హేయమైన చర్య అంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాజధాని అయిన పాట్నాలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను దేశానికి రెండో గాంధీగా అభివర్ణిస్తూ పోస్టర్లు కనిపించాయి. జనతాదళ్ యూనైటెడ్ పార్టీకి చెందిన ఆయన పార్టీ సభ్యులు ఈ పోస్టర్లను అంటించారు. నితీష్ కుమార్ సమానత్వం కోసం పోరాడారని.. ఆ పోస్టర్‌లో ఆయనపై ప్రశంసలు కురిపించారు. అలాగే సామాజికి సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. మహాత్మగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారంటూ ఆ పోస్టర్లలో రాసుకొచ్చారు.

Also read:  స్టేడియంలో ‘జై శ్రీ రామ్’ నినాదాలు.. గుజరాత్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

అయితే ఇలా నితీష్ కుమార్‌ను రెండో గాంధీగా పోలుస్తూ వచ్చిన పోస్టర్లపై విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు.. శివానంద్ తివారీ మాట్లాడుతూ ఈ పోస్టర్లను నితీష్ కుమార్ అభిమానులు అంటించి ఉండొచ్చని అన్నారు. కానీ నితీష్ కుమార్‌ను మహాత్మ గాంధీతో పోల్చడం అవమానించడమే అని.. అలా అవమానించవద్దని కోరారు. మహాత్మగాంధీ లాంటి వాళ్లు వెయ్యి సంవత్సరాలకు ఒకరు పుడతారని శివానంద్ తివారి అన్నారు.

#national-news #bihar-cm-nitish-kumar #bihar-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe