NITI Aayog meeting: ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరుగుతోంది. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలి ప్రాంతాల ఎల్‌జీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్నారు కేంద్రమంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు. కాగా నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) వాకౌట్ చేశారు. సమావేశంలో మాట్లాడనివ్వకుండా తన మైక్ ఆఫ్ చేసారని ఆమె ఆరోపించారు. నీతి ఆయోగ్ రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తిరిగి తేవాలని డిమాండ్ చేశారు.
కేంద్రం వివక్షా పూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ రాజకీయంగా ఉందని అన్నారు. చంద్రబాబుకు 20నిమిషాల టైమ్ ఇచ్చారని.. ఇతర సీఎంలకు 15 నుంచి 20నిమిషాల సమయమిచ్చారని అన్నారు. కనీసం తనకు 5 నిమిషాలు కూడా ఇవ్వకుండా మైక్ కట్ చేశారని మమతాబెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శలు చేశారు. మూడేళ్ల నుంచి బెంగాల్ లో అన్ని పనులు ఆపేశారని మండిపడ్డారు.
Also Read: ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్