Kolkata: అతనితో మాకు సంబంధం లేదు.. మమత సంచలన వ్యాఖ్యలు!

టీఎంసీ నాయకుడు, తన సోదరుడు బాబుల్‌ బెనర్జీతో అన్ని బంధాలను తెంచుకున్నట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బీజేపీతో ఆయన సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలోనే ఏదో సమస్య సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

New Update
CM Mamata Banerjee: నీతి ఆయోగ్ సమావేశం నుంచి సీఎం మమతా బెనర్జీ వాకౌట్‌

Mamata Banerjee Disowns Brother Babun: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాపై అసహనం వ్యక్తంచేస్తూ మాట్లాడిన తన సోదరుడు బాబుల్‌ బెనర్జీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. అతనితో అన్ని బంధాలను తెంచుకున్నట్లు తెలిపారు.

ఏదో సమస్య సృష్టిస్తున్నారు..
ఈ మేరకు మమత మాట్లాడుతూ.. 'నా ఫ్యామిలీ, నేను బాబుల్ తో అన్ని బంధాలను తెంచుకున్నాం. ప్రతిసారీ ఎన్నికల సమయంలోనే ఏదో సమస్య సృష్టిస్తున్నారు. అలాంటి అత్యాశపరులంటే నాకు నచ్చదు. కుటుంబ రాజకీయాలను విశ్వసించను. ఆయన మాటలు విన్నాను. బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఆయనకు నచ్చినట్లు చేసుకోనివ్వండి. బాబుల్ తో మాకు ఎలాంటి సంబంధం లేదు' అని మమత చెప్పారు. ప్రస్తుతం టీఎంసీలోనే కొనసాగుతున్న బాబూల్.. హావ్‌డా లోక్‌సభ స్థానాన్ని ప్రసూన్‌ బెనర్జీకి మరోసారి కేటాయించడంపై బాబుల్‌ తీవ్ర విమర్శలు చేశారు.

ఇది కూడా చదవండి: Viral: కింగ్ కోబ్రాతో కోతి సరసాలు.. ఇంటర్నెట్ ను షేక్ చేసిన వీడియో!

ఇదొక రాజకీయ జిమ్మిక్కు..
ఇదిలావుంటే.. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ సీఏఏను తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక రాజకీయ జిమ్మిక్కు అంటూ విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) జాతీయ పౌర పట్టికతో ముడిపడి ఉందన్నారు. తాము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని, అస్సాం మాదిరిగా పశ్చిమబెంగాల్‌లో శరణార్థి శిబిరాలను కోరుకోవడం లేదని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు