/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/BRS-chief-to-participate-in-Praja-Ashirwada-Sabha-jpg.webp)
BRS Public Meeting in Janagama: సీఎం కేసీఆర్ (CM KCR) సభ కోసం బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని సిద్ధిపేట రోడ్డుకు ఉన్న 18.23 ఎకరాల మెడికల్ కాలేజీ స్థలంలో సభను నిర్వహిస్తున్నారు. సభా వేదికతో పాటు ముఖ్యులు కూర్చునేందుకు జర్మన్ టెక్నాలజీతో కూడిన టెంటు వేశారు. దీంతో పాటు ప్రజల కోసం భారీ టెంట్లు వేశారు. సభకు లక్ష మంది వస్తారని బీఆర్‌ఎస్ (BRS Party) భావిస్తోంది. వారి కోసంమజ్జిగ, వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. వివిధ మండలాల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా వాహనాలను నిలిపి సభ ప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాటు చేశారు. కాగా.. జనగామకు చెందిన వారంతా.. ఒగ్గు కళాకారుల, డప్పు చప్పుళ్లు, కోలాట కళాకారుల విన్యాసాల మధ్య సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.
భారీ బందోబస్తు
కేసీఆర్ సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని, హెలి ప్యాడ్ నుంచి వేదిక వద్దకు వచ్చే మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్‌స్క్వాడ్ టీంలతో తనిఖీలు చేపట్టారు. సభ వేదిక దగ్గర ఏర్పాట్లను ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు పరిశీలించారు. ఇద్దరు డీసీపీలు, ఏడుగు రు ఏసీపీలు, 20 మంది సీఐలు, 55 మంది ఎస్సైలు, 107 మంది ఏఎస్సై, హెడ్ కానిస్టే బుళ్లు, 97 మంది హోంగార్డులు, 97 మంది క్విక్ రెస్పాన్స్ బృందాలు బందోబస్తులో పాలుపంచుకుంటున్నారు. సభకు వచ్చే వివిధ మండలాల ప్రజల కోసం ఐదు చోట్ల పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: బంగారం రేట్.. పసుపు రేట్ ఒకేలా ఉంది: ఎంపీ అరవింద్
జనగామ అభ్యర్థిగా తొలిసారిగా అసెంబ్లీ ఎ న్నికల బరిలో నిలవబోతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తాను అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఇదే తొలి సభ కావడంతో ఈ సభను మరింత సవాల్‌గా తీసుకున్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల క్ష్మయ్య (Ponnala Lakshmaiah) ఇదే సభలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకుంటారు. కాంగ్రెస్ నుంచి జనగామ టికెట్ రాకపోవటంతో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీలోకి చేరాలంటూ మంత్రి కేటీఆర్ (Minister KTR) పొన్నాల ఇంటికి వెళ్లగా ఆయన చేరికపై సుముఖం వ్యక్తం చేశారు. కాగా.. సీఎంతో పొన్నాల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో.. పొన్నాల జనగామకు సీఎం కేసీఆర్‌తో పాటే వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న మేనిఫెస్టోను ప్రకటించిన సీఎం కేసీఆర్ ఈ రోజు జనగామ మీటింగ్ లోనూ మరిన్ని సంచలన హామీలు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకు అందుకే బెయిల్ రావడం లేదు: మంత్రి అంబటి సంచలన వాఖ్యలు