CM KCR:సెంటిమెంట్ కంటిన్యూస్...కోనాయిపల్లి గుడికి సీఎం కేసీఆర్

కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి గుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళారు. సెంటిమెంట్ ప్రకారం నామినేషన్ పత్రాలను దేవుడి పాదాల ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

New Update
CM KCR:సెంటిమెంట్ కంటిన్యూస్...కోనాయిపల్లి గుడికి సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు భక్తి ఎక్కువే. ఏదైనా పని చేసే మందు పూజలు చేయడం బాగా అలవాటు. అలాగే ప్రతీసారి నామినేషన్ వేసే ముందు కూడా కేసీఆర్ కు ఒక సెంటిమెంట్ ఉంది. అదే కోనాయిపల్లికి వెళ్ళడం. సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలంలోని కోనాయిపల్లి గ్రామ వెంకటేశ్వర స్వామి మీద కేసీఆర్ మంచి గురి ఉంది. ప్రతీ ఎలక్షన్స్ లో నామినేషన్స్ వేసే ముందు ఆయన ఈ ఆలయాన్ని సందర్శించి..నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయిస్తారు. ఈసారి కూడా ఇదే సెంటిమెంటును కంటిన్యూ చేస్తున్నారు తెలంగాణ సీఎం.

మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి సీటు ఎక్కాలనుకుంటున్న కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారు. దీనికి సంబంధించి నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంది. నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు కేసీఆర్. దానికన్నా ముందు సెంటిమెంట్ దేవుడి దగ్గరకు నామినేషన్ పేపర్స్ ను తీసుకెళ్ళారు.  ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా కోనాయిపల్లికి చేరుకుని అక్కడ గుడిలో ప్రత్యేక పూజలు చేయించారు. వెంకటేశ్వర స్వామి ముందు నామినేషన్ పత్రాలు ఉంచి ప్రార్ధించారు. ఈ మధ్యనే కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాం పునర్నిర్మాణం జరిగింది. ఇది జరిగాక మొదటిసారి కేసీఆర్ ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. సిద్ధిపేట నుంచి టీడీపీ అభ్యర్ధిగా 1985లో మొదటిసారి పోటీ చేసినప్పటి నుంచి కేసీఆర్ ఈ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు.

కోనాయిపల్లి ఆలయం ప్రత్యేకత..

ఇదొక పురాతన ఆలయం. ఇక్కడ ఆలయ ప్రవేశ దక్షిణం వైపు ఉంటుంది. ఇలాంటి దక్షిణాభిముఖ ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి. దీన్ని గత ఏడాది పునర్నిర్మించారు. 3 కోట్లకు పైగా దీని కోసం ఖర్చు పెట్టారు. ఇక్కడ నామినేషన్ పత్రాలకు పూజ చేసి సమర్పించిన ప్రతీసారి కేసీఆర్ ఎన్నికల్లో విజయం సాధించారు. అందుకే ఈ సెంటిమెంట్ ను తప్పకుండా ఫాలో అవుతారు.

Advertisment
తాజా కథనాలు