CM KCR Public Meeting at Yellandu: ఎన్నికలను ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అన్నారు. తమాషా కోసం ఓటు వేయొద్దన్నారు. ఓటు వేసే ముందు నిజమైన పంథా ఉండాలన్నారు. మంచి చెడులను ఆలోచించి ఓటు వేస్తేనే ప్రజలు గెలుస్తారని పేర్కొన్నారు. బుధవారం నాడు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లందు(Yellandu)లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఓటు విలును ప్రజలకు తెలియజేశారు. దేశంలో రాజకీయ పరిణితి రావాలని అన్నారు. ఏ పార్టీ మంచిదో.. ఏ పార్టీ ప్రజలకు మేలు చేస్తుందో విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలన్నారు. అంతేకాదు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. ఇంకా చేయబోయే కార్యక్రమాలకు గురించి కూడా హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. అదే సమయంలో.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేశారు కేసీఆర్. డబ్బు మదంతో తమపై విరమ్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి ప్రజలే సరైన గుణపాఠం చెప్పాలన్నారు. ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభా వేదికగా సీఎం కేసీఆర్ ప్రసంగంలో కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం..
👉 రాజకీయ పరిణితి ఈ దేశంలో రావాలి.
👉 మంచి చేడులను అలోచించి ఓటువస్తేనే ప్రజలు గెలుస్తారు.
👉 ఏ పార్టీ మంచిదో తెలుసుకోవాలి.
👉 ఓటు తమాషా కోసమే ఓటు వెయ్యవద్దు.
👉 ఓటు వేసే ముందు నిజమైన పంథా ఉండాలి.
👉 బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీల కంటే ఎక్కువ అభివృద్ధిని చేసి చూపింది.
👉 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ.
👉 బీజేపీ ప్రభుత్వం వ్యసాయ మోటార్లకు కరెంట్ మీటర్ పట్టమంటే నా తలకాయ పోయినా మీటర్ పెట్టనని చెప్పాను.
👉 బీజేపీకి ప్రయివేట్ పిచ్చి పట్టింది.
👉 వ్యవసాయ స్థిరకరణలో భాగంగానే రైతుబంధు, వ్యసాయం బీమా, ధరణి పోర్టల్ వంటి పథకాలు అమలు చేశాం.
👉 హరిప్రియా నాయక్ చరిత్రలో నిలిచి ఉంటుంది.
👉 పొడు భూములకు పెట్టాలిచ్చి, రైతు బంధు ఇచ్చాము.
👉 హరిప్రియా నా బిడ్డ లాంటిది.
👉 హరిప్రియా కోరిక మేరకు కొమరారం మండలంగా, ఇల్లందును రెవిన్యూగా ఏర్పాటు చేస్తా.
👉 ఈ జిల్లాలో కొందరు డబ్బు హంకారంతో ఉండి బిఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు.
👉 రైతులకు కాంగ్రెస్ 3గంటల కరెంట్ చాలంటోంది.
👉 రాష్టంలో 3 కోట్ల ధాన్యం పండుతుంది.
👉 రాష్ట్రంలో ప్రజలకు సన్నబియ్యం ఇస్తాం.
👉 గ్యాస్ సిలండర్‌ను 400 రూపాయలకే ఇస్తాం.
👉 సాధారణ మరణానికి రూ. 5లక్షల బీమా అమలు చేస్తాం.
👉 విద్యాపరంగా అనేక కళాశాలల ఏర్పాటు చేశాం.
👉 త్వరలోనే సీతారామ ప్రాజెక్టు పూర్తి కాబోతుంది.
👉 బిఆర్ఎస్‌కు ప్రజలే బాసులు.
👉 కాంగ్రెస్, బీజేపీలా మాకు ఢిల్లీలో బాసులు లేరు.
👉 ఒకరోజు ఈ ప్రాంతం వచ్చి మీ సమస్యలు పరిస్కారం చేస్తా అని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.
Also Read: